గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతుంది అనే భావన చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే ఆ పార్టీ మాత్రం సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నది అని చాలా మంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుల. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పార్టీకి చాలా కీలకమైన సరే పార్టీ నేతలు మాత్రం సమర్థవంతంగా ప్రచారం నిర్వహించలేకపోవడంతో ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా దారుణంగా మారింది అనే భావన వ్యక్తమవుతోంది.

రాజకీయంగా ఒకప్పుడు హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనబడింది. ఇప్పుడు కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. అయినా సరే పార్టీ నేతలు మాత్రం సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం కూడా అసలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉంది. పార్టీ నేతల్లో చాలామంది లో ఏకాభిప్రాయం లేదు. వర్గ విభేదాలతో పార్టీ నాశనం అయిపోతుంది. అయితే ఇప్పుడు ప్రచారం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు కీలక నేతలు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి స్వయంగా తానే ప్రజల్లోకి వెళ్లాలని అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు. తన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆయనే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. పాదయాత్ర కూడా చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని కనీసం ఒక ఇరవై డివిజన్లలో పాదయాత్ర చేస్తే బాగుంటుంది అనే భావన రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ నాయకులతో కూడా ఒక నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: