మామూలు గా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేటప్పుడు లేదా ఆన్లైన్లో ఇతరుల కు డబ్బు లు పంపేటప్పుడు ఎంతో అప్రమత్తం గా ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం అజాగ్రత్త గా ఉన్నా ఇతరుల అకౌంట్ లో కి డబ్బులు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సార్లు అకౌంట్ నెంబర్ తప్పుగా టైప్ చేయడం కారణం గా కూడా  ఇతరుల అకౌంట్ లోకి డబ్బులు వెళ్తూ  ఉంటాయి. అందుకే డబ్బులు జమ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు బ్యాంక్ అకౌంట్ నెంబర్ను చెక్ చేసు కోవడం ఎంతో మంచిది.



 కానీ కొన్ని కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ టైం బాగోలేక పొర పాటున ఆన్లైన్ లో డబ్బులు ఇతరుల కు వెళ్ళి పోతుంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు పొర పాటున ఇతరులకు మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా పొరపాటు జరిగిన తర్వాత ఏం చేయాలో చాలా మందికి తెలియక అయోమయం లో పడి పోతూ ఉంటారు. అలా పొరపాటున వేరే అకౌంట్ కి డబ్బులు వెళ్ళినప్పుడు వెంటనే బ్యాంక్ అధికారులకు  సమాచారం అందించారు మీ బ్యాంక్ వివరాలు అన్ని తెలపాలి.



 పొరపాటున మీరు డబ్బులు పంపిన అకౌంట్ నెంబర్ కూడా బ్యాంకు అధికారులకు తెలియజేయాలి.. అంతేకాకుండా మీరు డబ్బులు పంపినట్లుగా ప్రూఫ్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎంతో మంచిది. ఒకవేళ మీరు డబ్బులు పంపిన అకౌంట్ మనుగడలో లేకపోతే మీ డబ్బులు వెంటనే వెనక్కి వచ్చేస్తాయి. ఒకవేళ పొరపాటున మీరు డబ్బులు పంపిన అకౌంట్ పని చేస్తూ ఉంటే పూర్తి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మీరు డబ్బులు పొరపాటున బ్యాంక్ అకౌంట్ కూడా ఒకటే బ్యాంక్ ఉంటే.. డబ్బులు వెంటనే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: