ఈ మధ్య కాలంలో ప్రతీ విషయంలో కూడా నకిలీ బెడద ఎక్కువ అయిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఆహారం దగ్గర నుంచి మొదలు పెడితే మనం వాడే ప్రతి వస్తువుకు కూడా ప్రస్తుతం నకిలీ ఎక్కువైపోతుంది. అచ్చం నిజమైన వస్తువు లాగే నకిలీ వస్తువులు కూడా తయారు చేస్తూ ప్రస్తుత మార్కెట్లోకి వస్తూ ఉండటంతో ఏ వస్తువు నకిలీది ఏ వస్తువు నిజమైనది అని కూడా గుర్తించడం చాలా కష్టం గా మారిపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మొబైల్స్ విషయంలో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో రకాల బ్రాండెడ్ మొబైల్ ల్స్  ప్రస్తుతం నకిలీలు మార్కెట్లోకి వచ్చి ఎంతో మందిని బురిడీ కొట్టిస్తున్నాయి .



 ఇక కొన్ని రోజుల్లోనే ఆ నకిలీ మొబైల్ కాస్త సరిగా పని చేయకపోవడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా నకిలీ ఫోన్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. దీంతో వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటు పోలీసులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎంతగానో క్రేజ్ సంపాదించి ప్రస్తుతం బాగా మార్కెట్ సంపాదించిన రెడ్ మీ  మొబైల్స్ కి  నకిలీ మొబైల్ ఎక్కువగా మార్కెట్లో చెలామణి అవుతున్నాయని తెలుస్తోంది.



 రెడ్ మీ  మొబైల్ కొనాలనుకునేవారు కాస్త అప్రమత్తంగా ఉండడం ఎంతో మంచిది అని అటు విశ్లేషకులు సూచిస్తున్నారు.  ఇటీవలే చెన్నై బెంగళూరులో విక్రయిస్తున్న మూడు వేల నకిలీ రెడ్ మీ ఫోన్ లను పోలీసులు సీజ్ చేసి నిందితులను అరెస్టు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.  వీటి విలువ 30 లక్షలకు పైగానే ఉంటుంది అని అటు పోలీస్ అధికారులు తెలిపారు.   కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా చార్జర్లు హెడ్ ఫోన్లు పవర్ బ్యాంకు లను కూడా వివిధ శాఖషాపులలో  అమ్ముతున్నారని అందుకే.. ప్రతి ఒక్కరు ఎంతో గుర్తింపు ఉన్న సైట్ లలో మాత్రమే మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలి అంటూ ప్రస్తుతం పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: