ఎప్పుడు ఏ పార్టీ నెగ్గుతుందో ఎవరికీ తెలుసు.. ప్రజలు ఏ పార్టీ ఎప్పుడు నమ్ముతారో ఎవరికీ తేలీదు.. అందుకు ఉదాహరణ ఏపీ లో టీడీపీ పార్టీ ఓటమి, దుబ్బాక లో టీ ఆర్ ఎస్ పార్టీ ఓటమి.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ ని ఎలాంటి బలం లేని పార్టీ ఓడించిందంటే వారు ఎంత గా ప్రజల్లో నమ్మకం సాధించారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీ పార్టీ ప్రజల్లోకి ఎలా దూసుకెళ్ళిందో కూడా అర్థం చేసుకోవచ్చు.. ఎంత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కి తెలంగాణ లో అస్సలు బలం లేని స్థాయి నుంచి నాలుగు ఏమీ సీట్లు, రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకునే స్థాయికి వచ్చిందంటే బీజేపీ ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు.  

ఇక గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ సిద్మవుతాడని. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దుబ్బాక నుంచి గెలిచిన రఘునందన్ రావు, మొన్నటి వరకూ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ వంటి వారు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు అయితే ఇప్పటివరకు వీరికి అదృష్టం కేసీఆర్ పై వెతిరేకత రూపంలో వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో వారికి చుక్కెదురవుతుని చెప్పొచ్చు.. ఎందుకంటే తక్కువ సమయం ఉండడం వల్ల పార్టీ లో పెద్ద గందరగోళం నెలకొంది.

దుబ్బాక మాదిరిగానే ఇక్కడ గెలవాలన్న బీజేపీ కి కేసీఆర్ వ్యూహం పెద్ద దెబ్బ వేసింది.. తక్కువ సమయం ఉండడం వల్ల ఎవరికీ సీట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోయింది బీజేపీ. తద్వారా పార్టీ లో కుమ్ములాటలు మొదలయ్యాయి.. అది కాస్త బజారున పడింది. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే నేతల మధ్య సఖ్యత కనిపించలేదు. బీ ఫారం పంపిణీలో విబేధాలు బయటపడ్డాయి. కీలక నేతల మధ్య లుకలుకలు పార్టీలో అనైక్యతను ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఇప్పటికే కూకట్ పల్లి, గోషా మహాల్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల్లో కుర్చీలు గాలిలో లేచాయి. వాటన్నింటికీ పరాకాష్టగా ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి ఆడియో కలకలం రేపుతోంది. తన ప్రధాన అనుచరుడికి కూడా న్యాయం చేయలేకపోయానని, బండి సంజయ్ అన్న తనకు అన్యాయం చేశారని రాజాసింగ్ వాపోవడం ఆసక్తికరంగా మారుతోంది.  ఈ దెబ్బతో బీజేపీ పరువు గాలిలో కలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: