రెడ్ మీ ఫోన్లు  మార్కెట్ లో ఎక్కువగా సెల్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ ఫోన్లకు మొబైల్ ప్రియులు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు..అందుకే వీటిని ఎక్కువగా కంపెనీ ఉత్పత్తి చేస్తూ వస్తుంది..అయితే వీటితో ప్రమాదం కూడా ఉందట అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి కొనాలని కొందరు అంటున్నారు.. ఎందుకంటే ఈ ఫోన్లలో కూడా మోసాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.



రెడ్ మీ ఫోన్ల పేరుతో ఘరానా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి..నకిలీ ఫోన్ల తో పాటుగా పవర్ బ్యాంకులు, రెడ్ మి కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను నకీలి పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పటికే చాలా మంది కొనుగోలు చేసి మోసపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..తాజాగా బెంగళూరు, చెన్నైలో రూ .33.3 లక్షల విలువైన నకిలీ షియోమి ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'నకిలీ' షియోమి ఉత్పత్తులను అమ్మినందుకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ ఉత్పత్తులు చెన్నైలోని నలుగురు సరఫరాదారులు మరియు బెంగళూరులో ముగ్గురు సరఫరాదారుల నుండి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మొబైల్ బ్యాక్ కేసులు, హెడ్‌ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు మరియు ఇయర్‌ ఫోన్‌లతో కూడిన 3000కి పైగా ఎంఐ ఉత్పత్తులు ఈ రైడ్ లో దొరికినట్లు పోలీసులు తెలిపారు.




బెంగళూరులో 24.9 లక్షల, చెన్నైలో 8.4 లక్షల విలువైన నకిలీ ఎంఐ ఇండియా ఉత్పత్తులను విక్రయించినందుకు రెండు నగరాల నుండి దుకాణ యజమానులను అరెస్టు చేశారు. ఇక ఈ ఆపరేషన్ తన నకిలీ నిరోధక కార్యక్రమంలో భాగమని షియోమి కంపెనీ వెల్లడించడం గమనార్హం..అక్టోబర్, నవంబర్ నెలల్లో మార్కెట్లో దాడులు జరిగాయి. రిజిస్టర్ ఫిర్యాదు తర్వాత, పోలీసు అధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు ఈ ప్రాంతంలో మూడు ప్రముఖ దుకాణాల నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.. ఈ విషయం పై పోలీసులు పూర్తి సమాచారాన్ని త్వరలోనే అందిస్తామని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: