భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ క‌నిపిస్తోందిగా కేసుల సంఖ్య‌కూడా రోజురోజుకు పెరుగుతూ పోతోంది. భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 37,975 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,77,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,314 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 480 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,34,218కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,04,955 మంది కోలుకున్నారు. 4,38,667 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,36,82,275 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,99,545 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,097 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,52,565 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,437 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,047 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,720 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి.


ఇదిలా ఉండ‌గా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగా గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు  24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 10 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,948కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,390 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 8,42,416కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 19, చిత్తూరులో 32, తూర్పు గోదావరిలో 104, గుంటూరులో 117,  కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరులో 30, ప్రకాశంలో25, శ్రీకాకుళంలో 19, విశాఖలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: