తెలంగాణలో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ కాస్త దూకుడు గానే ఉంది అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారం చేస్తున్న చేయకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ప్రచారం చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. కనీసం వారిని మీడియా కూడా ఫోకస్ చేయకపోవడంతో ఇప్పుటి వరకు బాగానే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా ప్రచారం చేసుకునే అవకాశం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం వరాలు ప్రకటించినా ప్రచారం చేయడానికి చాలామంది నేతలు ముందుకు రావడం లేదు.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాదులో ప్రచారం చేసే పరిస్థితి లేదు. బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని వార్తలు వచ్చిన సరే ఆయన ఎప్పుడు ప్రచారం చేస్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే బాలకృష్ణ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే నందమూరి కుటుంబానికి సంబంధించి కొందరు ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: