గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసలు ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రచారం చేసే విషయానికి సంబంధించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే త్వరలోనే ఆయన ప్రచారానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీఎం కేసీఆర్ ప్రచారం చేయడమే మంచిది అనే అభిప్రాయాన్ని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యక్తం చేస్తున్నది.

మంత్రి కేటీఆర్ కూడా ఇప్పుడు కేసీఆర్ ని ప్రచారం చేయాలని కోరినట్టు గా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ప్రచారం చేయాలి ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత కూడా రావడం లేదు. ప్రధానంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో సీఎం కేసీఆర్ ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా బిజెపి కాస్త బలంగా ఉంది. దీనితో ఇక్కడ ప్రచారం చేస్తే మంచిది అనే భావన వ్యక్తమవుతోంది.

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రచారం చేసుకునే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర నాయకత్వం త్వరలోనే ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తే టిఆర్ఎస్ పార్టీకి అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది అని బిజెపి ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగితే మంచిది అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: