తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలకోసం అన్నిపార్టీ లు సిద్ధమవుతున్నాయి.. ప్రచారాల జోరును హోరెత్తిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎన్నికలను ముందే పెట్టి ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి ఇక్కడ టీ ఆర్ ఎస్ కు ఎదురులేదు..  అందుకే గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తుంది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ..

అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారు.. ఇప్పటికైనా సర్దుకోకపోతే ఆంధ్ర లో టీడీపీ కి పట్టిన గతి పడుతుందని అన్నారు.. అయితే గ్రేటర్ లో కేసీఆర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. నిన్న ప్రకటించిన మేనిఫెస్టో లో ప్రజలకు లబ్ది చేకూరే పథకాలు ఎన్నో ఉన్నాయి.. ఇక బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇక్కడ టీడీపీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..

అయితే కొన్ని చోట్ల తమకు బలం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ అక్కడ గెలుపు కోసం చాల కృషి చేస్తుంది. అందుకోసం బాలకృష్ణ, లోకేష్ లను ప్రచారానికి సిద్ధం చేస్తుంది. ఇది టీడీపీ తరపున పోటీ చేస్తున్న వారివైపు నుంచి కొంత ఊరటనిచ్చే అంశమే. కానీ వీరిద్దరు తెలంగాణాలో ప్రచారానికి వస్తే తమకే మేలన్న భావనలో ప్రత్యర్ధులు కూడా వీరే రావాలని కోరుకుంటున్నారని సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంటే ప్రత్యర్ధులు కూడా బాలయ్యబాబు, లోకేష్‌బాబులు తెలంగాణాలో టీడీపీ తరపున ప్రచారం చేస్తే తమకే మేలు చేకూరుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: