ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనాకు టీకా తయారు చేయడానికి ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఆక్స్‌ఫర్డ్ తయారు చేస్తున్న కరోనా టీకాపై చాలా దేశాలు ఆశలు పెట్టుకొని ఉన్నాయి. వీటిలో భారత్ కూడా ఉంది. నిన్న మొన్నటి వరకూ ఈ టీకా.. కరోనాపై 62శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని ఆక్స్‌ఫర్డ్ చెప్పింది. కానీ హటాత్తుగా ఇప్పుడు ఇది 90శాతానికి చేరింది.

ఇదెలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ విషయం బయటపడింది. ఈ టీకీ పరీక్షల్లో జరిగిన పొరబాటే దీనికి కారణం అని తెలిసింది. ప్రయోగంలో భాగంగా తొలిసారి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వారిలో కొంత మందికి సగం డోస్ మాత్రమే ఇచ్చారట. ఇది పొరబాటున జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండోసారి టీకా ఇవ్వాల్సినప్పుడు ఫుల్ డోస్ ఇచ్చారట. ఇలా జరిగిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా కనిపించినట్లు వెల్లడైంది. రెండు సార్లు ఫుల్ డోస్ తీసుకున్న వారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఈ టీకా 62శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. కానీ తొలిసారి సగం డోస్ ఇచ్చి, రెండోసారి ఫుల్ డోస్ ఇస్తే 90శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని వెల్లడైంది.

ఈ విషయం తెలిసిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. కానీ మొత్తానికి ఫలితంపై మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. ఈ పొరబాటు కూడా మనకు కలిసొచ్చినట్లే. ఈ విషయం తెలిసి.. అప్పుడప్పుడు మనం చేసే తప్పులు కూడా ఇలా కలిసొస్తాయని కొందరు నవ్వేస్తున్నారు. ఏదేమైనా మనకు కరోనా టీకా ఎంత అద్భుతంగా పని చేస్తే అంత మంచిది కదా. కాబట్టి ఈ పొరబాటు చేసిన వారిని క్షమించేయొచ్చు. లేదంటే ఎంత పెద్ద గొడవ చేసినా తక్కువే. కరోనా అంటే మాటలా మరి. ఈ విషయంలో మీరేమంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి: