ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న శైలిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా రాష్ట్రంలో తమ మీద కక్షసాధింపు చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరుగుతుంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ కి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అనేది ఇప్పుడు ప్రమాదకరమని ఎన్నికల సంఘం కు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మాత్రం కాస్త ఎన్నికల సంఘం విషయంలో హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది.

అయితే హైకోర్టు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లే విధంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు దృష్టికి సీఎం జగన్ తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా రాజ్యాంగ నిపుణులతో కూడా సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఈ తరుణంలో సీఎం జగన్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసే విధంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: