ప్రపంచాన్ని వణికించిన కరోనా వల్ల చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ఎదుర్కొన్నారు.. కొన్ని ప్రాంతాల్లో చాలా వింత పరిణామాలు కూడా ఎదురయ్యాయి..ఎలా అంటే కరోనా వచ్చిందని ఆసుపత్రికి వెళ్ళిన పేషెంట్లకు అక్కడ సిబ్బంది మార్చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఇప్పుడు చాలానే జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన జరిగింది..అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల తర్వాత అతడు బతికే ఉన్నట్లు తెలిసింది. అంటే.. వాళ్లు మరో వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అసలు కుటుంబసభ్యులకు ఆ విషయం తెలిసిన తర్వాత కడచూపునకు కూడా నోచుకోలేకపోయామని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. హాస్పిటల్ తీరుపై పట్టరాన్ని కోపంతో ఉన్నారు.



వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలకు చెందిన శివ్‌దాస్ బెనర్జీ అనే వ్యక్తికి కరోనా సోకడంతో నవంబర్ 4న బలరాంపూర్‌ బసు హాస్పిటల్‌లో చేర్పించారు. నవంబర్ 13న హాస్పిటల్ సిబ్బంది బెనర్జీ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆయన చనిపోయినట్లు తెలిపారు.  ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఆసుపత్రికి వచ్చారు. ఇక వారికి మృతదేహాన్ని అందించారు. అయితే ఆ మృత దేహం ఎవరిది అనేది మాత్రం అక్కడ తెలియలేదు..



ఆయనకు అంత్యక్రియలు చేసిన వారం రోజులకు ఆసుపత్రి నుంచి ఒక ఫోన్ వచ్చింది. అతను ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పుకొచ్చారు.శివదాస్ బెనర్జీ కరోనాతో హాస్పిటల్‌లో చేరిన రోజే మోహినిమోహన్‌ ముఖర్జీ అనే మరో వ్యక్తి కరోనా సోకడంతో అదే హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన వయసు కూడా 75 ఏళ్లే. ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయణ్ని బరాసత్‌లోని మరో కేంద్రానికి తరలించారు. ఇక్కడే హాస్పిటల్ సిబ్బంది పొరపాటు చేశారు. ముఖర్జీతో పాటు ఆయనకు సంబంధించిన మెడికల్ ఫైల్ పంపించాల్సి ఉండగా.. పొరపాటున బెనర్జీ ఫైల్ పంపించారు.. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఆసుపత్రి పై వాగ్వాదానికి దిగారు..హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల బెనర్జీ, ముఖర్జీ కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడో పునరావృతం అవుతూనే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: