బీజేపీ నేతలు గోబెల్స్ కు కజిన్ బ్రదర్స్ లాగా అబద్దాలు చెబుతున్నారు అని మంత్రి కేటిఅర్ ఆరోపించారు. ప్రకాష్ జవదేకర్ వచ్చి అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. టిఆర్ఎస్ వైఫల్యం అనడానికి జవదేకర్ కు ఇంకిత జ్ఞానం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. మాకు ఎవరూ భాగస్వాములు కాదని ఆయన స్పష్టం చేసారు. పీడీపీ వంటి వేర్పాటు వాదులతో మీకు భాగస్వామ్యం ఉందని విమర్శలు చేసారు. మా మీద ఎందుకు ఛార్జిషీట్ వేయాలి అని ప్రశ్నించిన ఆయన... బీజేపీ కి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్.

కేంద్రమంత్రులే తెలంగాణ నంబర్ వన్ అంటుంటే ఛార్జి షీట్ వేయడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేసారు. మా రైతు బందును కాఫీ కొట్టినందుకు చార్జిషీట్ వేస్తారా అని నిలదీశారు. హైద్రాబాద్ కు ఒక్క రూపాయి పనైనా కేంద్రం చేసిందా కిషన్ రెడ్డి చెప్పాలి అని ఆయన సవాల్ చేసారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డికి పావుషేరు కు అమ్ముతున్నది మీరు అని మండిపడ్డారు. గుజరాత్ లోని కొందరి భవిష్యత్తు కోసం అమ్ముతున్నారా అని నిలదీశారు. గ్రేటర్ లో బీజేపీకి అవకాశం ఇస్తే చార్మినార్, గోల్కొండ, జిహెచ్ఎంసి ని కూడా అమ్మేస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

జిహెచ్ఎంసి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కు అన్యాయం చేసినందుకు 12కోట్ల చార్జీ షీట్లు మీ మీద వెయ్యాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఐటిఐఆర్ ను రద్దు చేసి యువకులకు అన్యాయం చేసినందుకు వారు మీ మీద చార్జీ షీట్ వేస్తారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నందుకు దేవుడు కూడా మీ మీద ఛార్జి షీట్ వేస్తారన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు, సీలేరును ముంచినందుకు మీ మీద ఛార్జి షీట్ వేయాలని ఆయన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ నేతలు మా మేనిఫెస్టో కవర్ పేజీ చూడొద్దు, కంటెంట్ చూడాలన్నారు. బీజేపీ బేచో ఇండియా అంటోంది మేము సోచో ఇండియా అంటున్నామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: