అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు అండగా నిలిచే విధంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించే విధంగా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ సర్కార్ ఇక ఇప్పుడు చేనేత పరిశ్రమను  మరింత అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతుంది. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మహిళలు అందరికీ కూడా శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.



 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా చేనేత చీరలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ప్రస్తుతం జగన్ సర్కార్ సిద్ధం చేస్తూ ఉందట.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సిబ్బంది కి చేనేత చీరలు అందించడం కారణంగా... ఓవైపు అంగన్వాడీలకు అండగా నిలవడంతో పాటు మరోవైపు చేనేత పరిశ్రమను కూడా మరింత ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి శాఖ సిద్ధం అవుతున్నట్లు  అర్థమవుతుంది.



 ఇప్పటికే కరోనా  వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను  ఆదుకొని మరింత తోడ్పాటు అందించే విధంగా జగన్ సర్కార్ ముందడుగు వేస్తున్న  క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా.. అంగన్వాడీ సిబ్బంది కి చేనేత చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.  తద్వారా చేనేత పరిశ్రమకు తోడ్పాటు అందించి.. చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ చేనేత చీరలు ఇటీవలే  పరిశీలించారు. త్వరలోనే చీరల రంగులు డిజైన్లపై కూడా నిర్ణయం తీసుకొని పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: