తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పై ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా బాబు మోహన్  మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో బాబు మోహన్ తెలంగాణ ముఖ్యమంత్రి పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణలో  ముఖ్యమంత్రి గారి పాలన సరిగా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని  బలం గా చెబుతున్నారు..

కెసిఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై కూడా బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జగన్ గారి పరిపాలన కూడా కెసిఆర్ లాగా ఉందని అన్నారు .రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని తాము ప్రవేశపెట్టిన పథకాలను నిరుపేదలకు అంద నివ్వకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకి అన్యాయం జరుగుతుందని వాళ్లని పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూశాక కెసిఆర్ కి అర్థమైందని అనుకుంటున్నానని  ఆ జోష్ లోనే ఇప్పుడు జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ ప్రజలు కూడా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చూడాలనుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు .. హైదరాబాద్లో జరిగే గ్రేటర్ ఎన్నికలు రణరంగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు గ్రేటర్ ఎన్నికల మానిఫెస్టోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాడివేడిగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలు ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని విషయం చెప్పడం కష్టం అవుతుంది.

బాబు మోహన్ మోహన్ పలు తెలుగు సినిమాలలో నటించారు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో చేరారు.. అలా టిడిపి, తెరాస పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యే కూడా అయినా బాబు మోహన్ ప్రస్తుతం బిజెపి పార్టీలో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: