గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య  మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోన ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు అని ఆయన నిలదీశారు. ప్రవేట్ ఆసుపత్రిలకు లాభం చేకూర్చే విదంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కరోన ట్రీట్మెంట్ ఎందుకు ఉచితంగా చేయటం లేదు అని నిలదీశారు. ఉచిత మంచి నీరు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.

దోబిలకు, సెలూన్లకు ఇప్పటి వరకు ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. డ్రైనేజ్ సిస్టం ఎందుకు బాగు చేయలేదు అని ప్రశ్నించారు. వరదలతో 100 మంది చనిపోయారు అని అన్నారు. గోదావరి కి మూసి అనుసంధానం గతంలో కూడా చెప్పారు అని, ఓట్ల కోసం జనాన్ని మభ్యపెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. మెట్రో రైల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎలక్షన్ వచ్చిందని మెట్రో గురించి మాట్లాడుతున్నారు అని విమర్శలు చేసారు. కానీ పాతబస్తీ కి ఎందుకు మెట్రో వెళ్ళలేదు అని నిలదీశారు.

టీఆర్ఎస్ నేతల మాటలు ఇంకా ఎంత కాలం ఇలా మభ్యపెడుతారు అని ఆయన నిలదీశారు. చెత్తబుట్టలో చిత్తు కాగితం మాత్రమే. అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గత ఏ ఎన్నికలు జరిగిన ఇవే మేనిఫెస్టో ఇచ్చారు అని, పచ్చి అబద్ధాలు,దగా మోసపు మాటలే అని మండిపడ్డారు. 2014నుండి చెప్తున్నారు దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిరుద్యోగ భృతి, ఎక్కడా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టో,టీఆర్ఎస్ పార్టీని చెత్తబుట్టలో వేయాలి అన్నారు. 100 రోజుల ప్రణాళిక, ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ భవనాలు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. గతంలో చెప్పిన పనులే చేయలేదు.. మళ్ళీ అవే మాటలు చెప్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జనాన్ని మోసం చేస్తున్నారు..జనాన్ని దొక చేస్తున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: