త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం విషయంలో టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీల కంటే కొంచెం ముందుగానే ఉంది. అందులో భాగంగానే మేనిఫెస్టో విడుదల చేయడమే కాకుండా రోడ్ షోలతో దూసుకుపోతుంది. ఈ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ... గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు ఇచ్చి ప్రజలు తమను దీవించారని ఈ సారి సెంచరీ కొట్టాలన్నారు కేటీఆర్. ప్రజల కనీస అవరాలైన మంచి నీటి సమస్యను తీర్చామన్నారు మంత్రి. 24 గంటల విద్యుత్ ను వ్యవసాయానికి, ఇళ్లకు ఇస్తున్నామన్నారు. వందేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయన్నారు. గండిపేట వంటి మరో రిజర్వాయర్ నిర్మించాలనే సోయ లేదన్నారు. సీఎం కేసీఆర్ కేశవపురంలో మరో రిజర్వాయర్ నిర్మిస్తాన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేస్తున్నామన్నారు. ఇక్కడే దిల్ సుఖ్ నగర్ లో కాంగ్రెస్ హయాంలో బాంబ్ బ్లాస్ట్ కాలేదా..? ఈ అరేళ్ళల్లో అలాంటివి జరిగాయా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కరోనా వస్తే కంటోన్మెంట్ జోన్లలో తిరిగామన్నారు. వరదలు వస్తే..ప్రజల్లోనే ఉన్నామన్నారు.


10వేలు ఇస్తే. ఆపినోళ్లు..రూ.25వేలు ఇస్తారా..? అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. రూ.650 కోట్లు ఇచ్చాం..ఎన్నికలు తర్వాత అర్హత ఉన్నవారికి వరద సాయం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ వరద సాయం కేంద్రానికి ఉత్తరం రాసి 8 వారాలైన ఉలుకు లేదు పలుకు లేదన్నారు. బీజేపీ వాళ్ళు హైదరాబాద్ లో చలాన్లు కడతామంటున్నారు. అహ్మదాబాద్, బెంగుళూరు లలో చలాన్లు కడుతున్నారా...? అని ప్రశ్నించారు కేటీఆర్. వరద బాధిత కుటుంబాలకు తలా పాతిక వేల రూపాయల చొప్పున అందిస్తామని, పూర్తిగా కేంద్రం నుంచే నిధులు తెప్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఆ మాటకే కట్టుబడి ఉండి పూర్తిగా కేంద్ర నిధులతో బాధిత కుటుంబాలకు తలా పాతిక వేల చొప్పున ఆర్థిక సాయం అందించగలిగితే దీపాలు వెలిగిస్తాం.. చప్పట్లూ కొడతామని, అవసరమైతే డ్యాన్సు కూడా చేస్తామన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు మద్దతుగా సోమవారం సాయంత్రం వనస్థలిపురంలోని రైతుబజార్ చౌరస్తా దగ్గర రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకల్ ఫర్ లోకల్ అని ప్రధాని మోదీ అంటున్నారన్నారు కేటీఆర్. తెలంగాణ పక్కా లోకల్...అన్నారు. గుజరాత్ గులాములు కావాలా..హైదరాబాద్ గులాబీలు కావాలో ఆలోచించాలన్నారు. ఎన్డీఏ, బీజేపీ రాష్ట్రానికి ఒక్క పనైనా చేశారా..? అడగండి అంటూ కేటీఆర్ నిలదీశారు. కిషన్ రెడ్డి ఒక్క రూపాయైన అదనపు నిధులు తెచ్చారా.. ? అంటూ ప్రచారానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలన్నారు. అరేళ్ళల్లో రాష్ట్రం కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్ల రూపాయలు కడితే..కేంద్రం రాష్ట్రానికి రూ.1.40 లక్షల కోట్లు మనకిచ్చిందన్నారు. మా పైసలే ఇతర రాష్ట్రాల్లో వాడుతున్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: