పటాన్ చెరు జీఎమ్మార్ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువజన  విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మూడు డివిజన్ల అభ్యర్థులు హాజరు అయ్యారు. మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ... మీ ఉత్సాహం చూస్తుంటే మూడు డివిజన్లు గెలుస్తామనిపిస్తుంది అని ఆయన అన్నారు. బండి సంజయ్  , కిషన్ రెడ్డిలు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు.

బండి సంజయ్ డబ్బులిస్తామని జుఠా మాటాలు మాట్లడితే... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు కేంద్రం నేరుగా డబ్బులివ్వదని చెప్పారు అని విమర్శలు చేసారు. హైదరాబాద్ కు అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ కే సాధ్యం  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. యూపీఏ సర్కారు ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరీ చేస్తే  .. బీజేపీ వచ్చాక దాన్ని రద్దు చేసి యువత నోట్లో మట్టి కొట్టారు అని మండిపడ్డారు. యువత బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలి అని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది అని మండిపడ్డారు.

అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలన్న మోదీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు అని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్క రూపాయి కూడా నల్ల ధనం బయటికి రాలేదు అని అన్నారు. నల్ల ధనమంతా బీజేపీ నేతల జేబులోకి వెళ్ళింది అని ఆయన మండిపడ్డారు. యువత అభివృద్ధికి టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలి అని ఆయన సూచించారు. బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గాలోని కంపెనీలలో స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తా అని  హామీ ఇచ్చారు. కాగా రెండు రోజుల నుంచి హరీష్ రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: