ఒక పక్క కరోనాతో, మరో పక్క చలితో ఇబ్బంది పడుతున్న తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను ఇప్పుడు నివర్ తుఫాను ఆందోళన కలిగిస్తుంది. ఇది తీవ్ర తుఫాన్ గా మారింది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని తీవ్రతపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై ఇప్పుడు ఏపీ తెలంగాణా రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. దీనితో ఏపీ సహకారం కేంద్రం సహకారంతో ముందుకు వెళ్తుంది తమిళనాడు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రం అయి తుఫాన్ గా మారింది.

వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా,తదుపరి 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారనున్న నివర్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్ల్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం   ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్ల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు  హెచ్చరికలు జారీ చేసారు. తుపాను కారణంగా కడల్లోర్, విల్లుపురం, పుదుచ్చేరి తదితర తీరప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీరంలో ముందు జాగ్రత్త చర్యగా రెండు కొస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించారు. తమిళనాడు సిఎం కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: