తుఫాన్ దెబ్బకు ఇప్పుడు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు కంగారు పడుతున్నాయి. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళన అందరిలో కూడా నెలకొంది. ఇప్పటికే తమిళనాడులో కొన్ని జిల్లాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక అధికారులు కూడా ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కృష్ణ జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూలంగా రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్... టెలీ కాన్సెరెన్స్ ద్వారా అధికారు లకు, రెవిన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.  అన్ని డివిజనల్ కార్యాలయాల్లో  కంట్రోల్ రూమ్ లు  ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ యంత్రాంగానికి సహకరించాలి అని అన్నారు. కృష్ణా  జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు ఆయన మీడియా ముందు పెట్టారు.

బందరు కలెక్టరేట్ : 08672-252572

విజయవాడలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805

సబ్ కలెక్టర్ ఆఫీస్  విజయవాడ  : 0866-2574454

సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు
 08656- 232717

రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486

రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697    
                                                                                                                                                భారీ వర్షాలు కారణంగా పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని ఆయన సూచించారు. మత్స్యకారులెవరు సముద్రంలోకి వేటకు పోరాదు అని హెచ్చరించారు. విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు వారివారి ప్రాంతాల తహశీల్దార్లను అప్రమత్తం చేయాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: