జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక, ఉత్తరాంధ్రలో టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. జగన్ ఏమో విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటే, దాన్ని చంద్రబాబు వ్యతిరేకించి అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా చంద్రబాబు అమరావతికి స్టాండ్ అవ్వడంలో విశాఖలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి.

ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి వైసీపీ గూటికి వెళ్లారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబులు వైసీపీలోకి వెళ్లారు. ఇక విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో కనిపించడం లేదు. ఈయన ఎప్పటి నుంచో పార్టీ మార్పు ఖాయమని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు గంటా మాత్రం పార్టీ మారలేదు. అలా అని టీడీపీలో లేరు.

అయితే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ముందు గంటా వైసీపీ వైపు వెళ్ళే అవకాశముందని అంటున్నారు. కానీ గంటా వెళ్ళిన వెళ్లకపోయినా టీడీపీ వాళ్ళు మాత్రం ఆయన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు సైతం గంటా విషయం గురించి వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో గంటా టీడీపీలో ఉండటం కష్టమే. ఇక గంటా టీడీపీని వీడితే విశాఖ నార్త్‌లో ఆ పార్టీకి గట్టి నాయకత్వం ఉండదు.

ఈ క్రమంలోనే గంటాకు రీప్లేస్ కూడా దొరికినట్లే అని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. విశాఖ బీజేపీలో కీలకంగా ఉన్న విష్ణుకుమార్ రాజు టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా విష్ణు బీజేపీ నుంచి పోటీ చేసి విశాఖ నార్త్ సీటులో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో విష్ణు బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి గంటా పోటీ చేసి విజయం సాధించారు. అయితే విష్ణు బీజేపీలో ఉన్నా సరే వైసీపీ ప్రభుత్వానికి ఫుల్ అపోజిట్‌గా మాట్లాడుతున్నారు. తాజాగా విశాఖలో టీడీపీ నేతల ఇళ్ల కూల్చివేతల విషయంలో జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే, విష్ణు మాత్రం జగన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఇక దీని బట్టి చూస్తే త్వరలో టీడీపీలోకి ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: