ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది అన్న విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కరోనా  వైరస్ ఎంతో మంది పై పంజా విసిరి  శరవేగంగా వ్యాప్తిచెందడమే కాదు ఎంతో మంది ప్రాణాలను కూడా బలి తీసుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పై అవగాహన తెచ్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ బారిన పడకుండా ఉంటుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అగ్ర రాజ్యాలలో కరోనా సెకెండ్ వేవ్  వెలుగులోకి వచ్చి శరవేగంగా కేసులు వ్యాప్తి చెందుతూ మరింత తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.



 ముఖ్యంగా ప్రపంచ అగ్రరాజ్యాల లోనే కరోనా సెకెండ్ వేవ్  శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాలకు జర్మనీ ఒక ఉదాహరణగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రపంచ అగ్ర రాజ్యాల లో ఒకటి జర్మనీ. ఇక్కడ కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎన్నో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది.  కరోనా వైరస్ ను కంట్రోల్ చేసింది కానీ అంతలోనే కరోనా వైరస్ సెకండ్ వేవ్  ప్రారంభం కావడంతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో పాటు ప్రపంచ దేశాలు కూడా జర్మనీ ని చూస్తూ వణికిపోతూ అప్రమత్తం అవుతున్నాయి.



 జర్మనీ తో పాటు ప్రస్తుతం వివిధ దేశాలు కూడా లాక్ డౌన్  ఆంక్షలు దిశగా అడుగులు వేస్తున్నారు. కెనడా ఇంగ్లాండ్ ఇటలీ లాంటి దేశాలు ప్రస్తుతం కఠిన ఆంక్షలను మరోసారి అమలులోకి తెస్తున్నాయ్. ఈ క్రమంలోనే భారత్ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని  విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించక పోతే మాత్రం రానున్న రోజుల్లో భారత్లో దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: