పాకిస్తాన్లో రోజురోజుకు దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నో దుర్మార్గాలకు పాల్పడటంతో పాటు మరోవైపు చైనా సైనికులు కూడా పాకిస్తాన్ లో  ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరిస్తు.. దారుణాలకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ మహిళల విషయంలో చైనా సైనికులు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటుంది. ఇక ఇలా రోజుకు చైనా కు బానిస దేశం గా మారిపోయిన పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి.  ప్రజలకు కనీస రక్షణ లేకుండా పోతుంది. అయితే ఈ విషయాలను సాధారణంగా పాకిస్తాన్ మీడియా ఎక్కడ తెరమీదికి చూపించదు అన్న విషయం తెలిసిందే



 కానీ సోషల్ మీడియా మాత్రం ప్రస్తుతం ప్రతి విషయాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధారణంగానే సోషల్ మీడియా గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసినదే.  ఇక పాకిస్తాన్ లో జరిగే కొండంత దుర్మార్గాలను మరింత ఫోకస్ చేసి చూపిస్తూ ఉండడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం సోషల్ మీడియా తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై ఇమ్రాన్ఖాన్ తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించడం సంచలనంగా మారిపోయింది. ఫేస్బుక్ గూగుల్ సహా మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్.




 దీంతో కీలక నిర్ణయం తీసుకున్న సోషల్ మీడియా సంస్థలు పాక్  దేశంలో మేము కార్యకలాపాలు నిర్వహించ లేము అంటూ ఓపెన్ గా  ప్రకటించి బయటికి వచ్చేస్తున్నాయి. పాకిస్తాన్ లో కొత్త రూల్ పెట్టింది ప్రభుత్వం. ఉగ్రవాదానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ఉండడానికి వీలు లేదని ఒకవేళ అలా పెడితే భారీగా జరిమానాలు కట్టాలని నిబంధన విధించింది. అంతే కాకుండా ఏ సమాచారాన్ని ప్రభుత్వం అడిగిన సవివరంగా ఇవ్వాలని.. ప్రభుత్వం తీసేయమన్న  సమాచారాన్ని సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ నిబంధన పెట్టడంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు  పాకిస్థాన్ నుంచి బయటకు వెళ్ళిపోతామూ  అంటూ ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: