ప్రస్తుతం పాకిస్థాన్ ఫ్రాన్స్  మధ్య వివాదం రోజు రోజుకు ముదిరిపోతుంది తప్ప ఎక్కడా సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ లో  రోజురోజుకు మత విద్వేషకులు  పెరిగిపోతూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఫ్రాన్స్ లో రాడికల్  టెర్రరిజానికి పాల్పడితే సహించేది లేదు అంటూ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఎవరైనా రాడికల్  టెర్రరిజానికి పాల్పడినట్లు తేలితే ఎక్కడికక్కడ కాల్చేయాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది ఫ్రాన్స్. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ మాటలను పాకిస్తాన్ తీవ్రస్థాయిలో తప్పుబడుతూ ఏకంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు కి ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చింది.


 ఇక ఆ తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ఫ్రాన్స్ దౌత్యపరమైన కార్యాలయాన్ని ముట్టడించి దాడులకు జరగడం కూడా ఫ్రాన్స్ పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసే లా మారింది ఇక ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న వివాదాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇటీవలే మరో ఘటన కూడా జరిగింది. ఇటీవలే పాకిస్థాన్  లో ఒక మతపరమైన అటువంటి కార్యక్రమం జరిగింది. ఇది కాస్త ప్రస్తుతం రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని మరింత తారా స్థాయికి తీసుకెళ్లే విధంగా మారిపోయింది.


 లాభాయక్  సంస్థ అధిపతి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ పై అణ్వస్త్ర దాడి చేయాలి అంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు పాకిస్తాన్ తమ దగ్గర అణ్వస్త్రాలు  ఉన్నాయి అంటూ పలు మార్లు వ్యాఖ్యానించింది. ఇక ఇప్పుడు ఏకంగా ఒక ఉగ్రవాద సంస్థ అణ్వస్త్ర  దాడి చేయాలంటూ పాకిస్థాన్ ను డిమాండ్  చేయడం మరింత సంచలనంగా మారిపోయింది. దీనిపై ఫ్రాన్స్ ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం మరింత సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: