పాకిస్తాన్  ఎప్పుడూ భారత్లో విధ్వంసం సృష్టించేందు కు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అన్న  విషయం తెలిసిందే. ఈ మధ్య కాలం లో కేంద్ర ప్రభుత్వం భారత ఆర్మీ కి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చిన నేపథ్యం లో భారత ఆర్మీ మరింత అప్రమత్తం గా సరిహద్దుల్లో ఉంటూ సరిహద్దు ల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఆర్మీ ని  ఎప్పటికప్పుడు మట్టు  పెట్టడంతో పాటు అక్రమం గా భారత భూభాగం లోకి చొరబడేందుకు ప్రయత్నించి  విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదులను కూడా గుర్తించి ఎక్కడికక్కడ మట్టు  పెడుతుంది అన్న విషయం తెలిసిందే.



 కొన్ని రోజుల నుంచి భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేత మిషన్ కొనసాగుతుండడంతో ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టినది.  ఇక ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు  ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భారత సైన్యం మాత్రం  చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. భారత ఆర్మీ కంటపడకుండా భారత్లోకి ఎంటరై విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.




 ఈ క్రమంలోనే సొరంగాలు  గుర్తించడంతో పాటు భూమి లో ఉన్నటువంటి ఆయుధాలను గుర్తించడానికి మిషన్లను  పట్టుకుని ప్రస్తుతం భారత ఆర్మీ సరిహద్దుల్లో జల్లెడ పడుతుంది భారత్ ఆర్మీ . ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగాలను గుర్తిస్తుంది. ఇటీవల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక సొరంగ మార్గాన్ని గుర్తించింది భారత ఆర్మీ. ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో భారత్ లోకి ఎంటరైన నలుగురు జైషే  మొహమ్మద్ ఉగ్రవాదులు కూడా ఈ సొరంగ మార్గం ద్వారానే భారత్లోకి వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఇలాంటి సొరంగాన్ని గుర్తించే పనిలో పడింది భారత ఆర్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: