ఆంద్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు.  ఏపీలో ఎప్పుడో జరగవలసిన స్థానిక ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి . తాజాగా స్థానిక ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నట్టు ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. 

ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.నేడు టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు.. జగన్ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం అని తీవ్రంగా మండి పడ్డారు., టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లన్నటిని పేదలకు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమని వైసీపీ భయపడుతుందని అన్నారు.వైసీపీ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.. వైసీపీని వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వీడదని చంద్రబాబు మాట్లాడారు.మరి స్థానిక ఎన్నికలపై జరుగుతున్న వివాదం సద్దుమనిగి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: