తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి తో కూడిన సందేశాన్ని పంపించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, నివారణ, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వంటి విషయాలపై మోడీ చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.



 అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఒక సందేశాన్ని పంపించారు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నయని, తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కె సి ఆర్ ఓ సందేశాన్ని పంపించారు.


" దయచేసి మీరు విధిగా మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి, గుంపులుగా కలవకండి, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి, కరుణ వైరస్ సోకిన ట్లుగా అనుమానం వస్తే, మీ దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్ట్ ఉచితంగా చేయించుకోండి." అంటూ కేసీఆర్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: