తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల హవా మాములుగా లేదు.. ఇప్పటికే టీ ఆర్ ఎస్ పార్టీ తన మేనిఫెస్టో ని ప్రకటించి ప్రజలను ఆకర్షించగా కాంగ్రెస్ కూడా ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో ని ప్రకటించింది.. చూస్తుంటే కాంగ్రెస్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లా అనుకుంటుంది. అంతకు మించి భాగ్యనగరంలో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే కేసీఆర్ ఉచిత మంచి నీటి పథకం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. అంతేకాదు సినీ పరిశ్రమకు, చిరువ్యాపారులకు అందరికి లబ్ది చేకూరేలా కేసీఆర్ తన మేనిఫెస్టో ని రిలీజ్ చేయగా ఇప్పుడు కాంగ్రెస్ అంతకుమించి మేనిఫెస్టో ని రిలీజ్ చేసి అందరి నోళ్లు తెరుచుకుని చూసేలా చేసింది.

వరద సాయం కేసీఆర్  పదివేలు ప్రకటించగా బీజేపీ 25 ,000 ప్రకటించింది.. కానీ కాంగ్రెస్ వరద సాయాన్ని యాభై వీలుగా ప్రకటించింది. అంతేకాదు ళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చేశారు.అంతేకాదు ఎంఎంటీఎస్ రైళ్లలో వికలాంగులకు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఇంకా మెట్రో రైలు పాతబస్తీ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించే విధంగా పనిచేశామని ప్రకటించింది.

ఇంకా ఈ మేనిఫెస్టో లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్పించడం.. కార్పొరేట్‌ విద్యా సంస్థలల్లో ఫీజులను నియంత్రించడం లాంటి హామీలు కూడా ఉన్నాయి.100 యూనిట్లలోపు గృహవినియోగదారులకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. వరదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వరద రహిత హైదరాబాద్ కోసం జపాన్, జర్మనీ టెక్నాలజీ తీసుకొస్తామన్నారు. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చి.. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్‌, బీఆర్ఎస్‌ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు చూస్తుంటే కాంగ్రెస్ అరచేతిలో ఆకాశం చూపిస్తున్నట్లు ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని ఏవిధంగా ఈ హామీలకు నిధులు సమకూరుస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: