గ్రేటర్ లో టీఆర్ఎస్ కు స్థానం లేకుండా చేయాలనే పట్టుదలతో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఎక్కడ టిఆర్ఎస్ ప్రభావం కనిపించకుండా, బిజెపి తన సత్తా చాటుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ, ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తూ, రాజకీయ ప్రత్యర్ధులు కోలుకోలేని విధంగా చక్రం తిప్పుతున్నారు.ముఖ్యంగా ఈ గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు స్థానం లేకుండా చేస్తే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని అభిప్రాయంలో బిజెపి నాయకులు ఉన్నారు. అందుకే తమ శక్తికి మించి గ్రేటర్ లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. దీనికోసమే బీజేపీ అగ్ర నేతలను రంగంలోకి దించాలని బిజెపి చూస్తోంది.



దేశవ్యాప్తంగా బీజేపీ లో ఉన్న అగ్రనేతలందరి గ్రేటర్ లో మోహరించేందుకు బిజెపి గట్టిగానే కసరత్తు చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ను విజయం వైపు నడిపించిన, భూపేంద్ర యాదవ్ ను గ్రేటర్ ఎన్నికల ఇన్చార్జిగా నియమించింది. కేంద్ర మంత్రులను గ్రేటర్ లో    ప్రచారానికి దింపాలి అని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. రెండు రోజుల క్రితమే గ్రేటర్ లో ప్రచారం చేసేందుకు వచ్చిన ప్రకాష్ జవదేకర్ కేసీఆర్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఛార్జిషీట్ విడుదల చేశారు. అలాగే బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కూడా గ్రేటర్ లోనే ప్రస్తుతం పర్యటిస్తున్నారు.




చేంజ్ హైదరాబాద్ పేరిట వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ కేడర్ లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేడు గ్రేటర్ లో ప్రచారం చేయబోతున్నారు. తెలంగాణ ఉద్యమంతోనూ, అనుబంధం ఉండడంతో, ఆమెను ఇక్కడ బిజెపి రంగంలోకి దింపుతుంది.అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తో పాటు మరి కొంతమంది నాయకులు గ్రేటర్ లో బిజెపి తరఫున ఎన్నికల ప్రచారానికి దిగి ఎన్నికల్లో పై చేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: