పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలపై దృష్టి పెట్టారు.. దాదాపు ఐదు సినిమాలు అయన సెట్స్ మీద ఉంచారు.. ఒకదానికొకటి విభిన్నమైన సినిమాలు కావడంతో ఈ సినిమా లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు న్నాయి.. ఇక పవన్ సినిమాలకు వెళ్లడం రాజకీయ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.. అసలే పార్టీ ఒక్కటే సీటు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో ఉండాల్సింది పోయి పవన్ ఇలా సినిమాలు చేసుకోవడం వారికి అసలే నచ్చడం లేదు.. ఒకవైపు ఇతర పార్టీ లు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. కానీ బీజేపీ తో పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా మొత్తం బీజేపీ కి వదిలేయడం వారికి ఏ మాత్రము నచ్చడం లేదట..

అయితే ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని జనసేన ని లేకుండా చేసే విధంగా ప్లాన్ చేస్తుందని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ లో పవన్ కి పోటీ చేద్దామని ఉన్నా బీజేపీ పార్టీ బలవంతంగా పార్టీ మార్పించేసింది.. తిరుపతి చేద్దామని చూస్తుటేనే బీజేపీ వద్దంటూ అడ్డు తగులుతుంది.. పొత్తు అంటే ఒకసారి ఒకరు తగ్గితే ఇంకోసారి ఇంకొకరు తగ్గాలి కానీ ఇక్కడ ఆలా కాదు మొత్తం జనసేన త్యాగం చేస్తూ బీజేపీ బలపడడానికి బలవుతుంది..

పవన్ కల్యాణ్ పెట్టిన్ పార్టీ జనసేన, దాన్ని కష్టమైనా నష్టమైనా సాకాల్సింది పవనే. బీజేపీ ఒడిలోకి తెచ్చి పెట్టి పెంచి పెద్ద చేయమంటే కుదిరే పనేనా. రాజకీయాల్లో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. పవన్ సినిమాలు చేసుకుంటూ బీజేపీ మీద అధారపడి రాజకీయాలు నడుపుదామనుకుంటే కమలంతో కుదిరే పని అసలు కాదు, పవన్ కల్యాణ్ కూడా కార్యక్షేత్రంలో ఉండాలి. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కి మోడీ అప్పాయింట్మెంట్ యివ్వలేదంటే పవన్ అంటే ఎంత చులకనా అర్థం చేసుకోవచ్చు.తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ జాతకాన్ని తేల్చుతుంది అని అంతా అనుకుంటారు. కానీ బీజేపీ, జనసేన మిత్రత్వానికి కూడా అది అగ్ని పరీక్ష పెడుతుందని ఇపుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని సంప్రదించారో లేదో కానీ తిరుపతి నుంచి తాము పోటీ చేస్తామని బీజేపీ పెద్దలు చెప్పుకున్నారు. ఉప ఎన్నికల సన్నాహక మీటింగు కూడా తిరుపతిలో తాజాగా పెట్టి మరీ హుషార్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: