కాంగ్రెస్ పార్టీ లో ప్రభుత్వాన్ని విమర్శించే నేత ఒక్క రేవంత్ రెడ్డి అని చెప్పాలి.. మొదటినుంచి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి కి ఆగ్రహం ఎక్కువ.. అందుకే కేసీఆర్ ని విపరీతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. గతంలో ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి ని ప్లాన్ ప్రకారం కేసీఆర్ పట్టించాడు. చంద్రబాబు కూడా ఈ కేసులో ఉన్నాడు కానీ ప్రస్తుతం ఈ కేసు మూలకు పదిపాయింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లో చేరేలా చేసింది. అప్పటినుంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఎక్కుఅవగా విమర్శలు చేస్తూ వస్తున్నారు..

ఇక ఇప్పడూ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.  తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి, ఎంపీ ఎలక్షన్స్ ఘోర పరాభవం, మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో గల్లంతు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కి ఆశాజనక ఫలితాలు కావు.. అయినా ఈ గ్రేటర్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉంటె రేవంత్ రెడ్డి వర్గం బలంలేని కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ లోకి వెళ్లేలా ప్లాన్స్ చేస్తుందని వార్తలు వస్తుంన్నాయి..

అందుకు తగ్గట్లే బీజేపీ కూడా రేవంత్ ని లాక్కోవడానికి ప్రణాళికలు వేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా  ఎంతో కాలం ఇతర నాయకుల నుంచి మద్దతు లేకుండా నెట్టుకురావటం కష్టమని ఆయన భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కనీస స్థాయిలో డివిజన్లని గెలవలేక పొతే, ఆయన తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకోక తప్పదని పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటికే విజయశాంతి రెడీ అయ్యారు. కానీ బిజెపి మాత్రం రేవంత్ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. మీరు రండి… కానీ తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురండి. అంతే కాదు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రావాలి. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి కూడా మీకు సన్నిహితులు. ఆయనతో కూడా మీరు చర్చలు జరపండి. వారిని కూడా తీసుకురండి అని చెప్తుందట..

మరింత సమాచారం తెలుసుకోండి: