తిరుమలలో రాష్ట్రపతి పర్యటన లో జిల్లా కలెక్టర్ కి ఎదురైన చేదు అనుభవం. నేను కలెక్టర్ ని అంటున్నా...  లోపలికి అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులు. ఆపినందుకు కొంచెం బాధనిపించినా... వారి కర్తవ్యం వారు నిర్వహించారు అని సర్లే అనుకున్న కలెక్టర్. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిని అంటున్నా మాట వినకుండా వారిని తిరస్కరించడం ఆశ్చర్య దగ్గ విషయమే.. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ చూస్తుంటాం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..??

తిరుమల రాష్ట్రపతి పర్యటనలో జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా కి చేదు అనుభవం ఎదురవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రపతి పర్యటన కారణంగా ఆలయంలోకి ప్రవేశించేందుకు ముందుగా బయోమెట్రిక్ వద్దకు వెళ్లారు జిల్లా కలెక్టర్  నారాయణ్ భరత్  గుప్తా.... అయితే అక్కడ ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు  ఆయన్ని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. కలెక్టర్ ని అంటున్నా వినిపించుకోలేదు. ఇక తప్పక కలెక్టర్ నారాయణ్  భరత్ గుప్తా వెనుదిరిగి వెళ్లారు. ఎంత ఉన్నత పదవిలో ఉన్న కలెక్టర్ నే తిరుమల సిబ్బంది ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.... ఈ న్యూస్ వైరల్ గా మారింది.

రాష్ర్టపతి పర్యటనలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి చెప్తున్నా వినకుండా  టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆయన్ని అడ్డుకొని అవమానించడం సంచలనంగా మారింది. అయితే కొంత సమయం తర్వాత విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు  విజిలెన్స్ అధికారులను మందలించి కలెక్టర్ నారాయణ్  భరత్ కుమార్ గుప్తా ను లోపలికి తీసుకు వెళ్లారు. అలా రాష్ట్రపతి పర్యటన లో భాగంగా తిరుమలకు వెళ్లిన జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కు అనుకోని సంఘటన ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: