దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతి చెందారు. ఆయన గత నెల కరోనా బారిన పడ్డారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు వివరించారు.



అతని కుమారుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇదో బాధాకర విషయం. ఇలా చెబుతున్నందుకు చింతిస్తున్నాను. నా తండ్రి కన్నుమూశారు. బుధవారం ఉదయం 3.30కి తుదిశ్వాస విడిచారు. నెల కిందట కరోనా పాజిటివ్ వచ్చాక, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. అవయవాలు సరిగా పనిచేయలేదు. దయచేసి నేను అందర్నీ కోరేది ఒకటే. కరోనా నిబంధనలు పాటించండి. సమూహాలలోకి వెళ్లకండి. సేఫ్ డిస్టా్న్స్ పాటించండి. కరోనాతో జాగ్రత్త పడండి" అని ఫైజల్ పటేల్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న అహ్మద్ పటేల్..‌ సుదీర్ఘకాలం సోనియాంగాధీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. గుజరాత్‌ నుంచి పలుమార్లు పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆయన మొదటిసారిగా 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 వరకు మూడుసార్లు ఎంపీ ఎన్నికల్లో గెలుపొందారు. 1993 నుంచి రాజసభ్య సభ్యునిగా కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: