గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయశాంతి ప్రచారం చేసే విషయానికి సంబంధించి ఎలాంటి స్పష్టత కూడా రావడం లేదు. ఆమె త్వరలోనే ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద ఆమె అంతగా దృష్టి పెట్టడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆమెకు ప్రజల్లో అంత ఆదరణ లేదని ఒకవేళ ఆమె ప్రచారం చేసినా సరే పెద్దగా ఫలించే అవకాశం ఉండకపోవచ్చు అని పలువురు భావిస్తున్నారు. దీనివలన పార్టీకి వచ్చే ఉపయోగం ఏమీ లేదు అనే వ్యాఖ్యలు కూడా భారతీయ జనతా పార్టీ నేతలలో ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నిలబడాలి. అయితే వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఈ నేపథ్యంలో విజయశాంతిని ప్రచారం చేయమని కొంతమంది నేతలు సూచిస్తున్నారు. అయితే విజయ శాంతి మాత్రం ఇప్పుడు ప్రచారం చేయను అని చెప్పినట్లుగా సమాచారం. మరి ఆమె ప్రచారం చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడు విజయశాంతి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.

ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఆమె ఫోకస్ పెట్టారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ ప్రాంతాల్లో పర్యటన చేసి యువతను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆమె రెడీ అవుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి అని భావిస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీలో పని చేసిన సందర్భంలో ఆమెకు కొంత మంది తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుందని ఆమె భావిస్తున్నారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అయిన వెంటనే ఇక్కడ ప్రచారం చేస్తానని చెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: