ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు డెబిట్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారు దాదాపుగా. ఒకవేళ క్రెడిట్ కార్డు కలిగి లేకుండా ఉన్నప్పటికీ ప్రస్తుతం బ్యాంకులు వివిధ రకాల ఆఫర్లు ఇస్తూనే క్రెడిట్ కార్డ్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకు ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం పెరిగి పోతూనే ఉంది. కాగా క్రెడిట్ కార్డు వినియోగదారులందరికీ అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తూ ఆయా బ్యాంకులు ప్రస్తుతం ఎన్నో ఆకర్షణీయమైన ప్రయోజనకరమైన ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల తమ కస్టమర్లకు ప్రైవేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు శుభవార్త చెప్పింది...


 కొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎస్ బ్యాంక్. సాధారణంగా అయితే ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు వినియోగం పై సాధించిన రివార్డ్ పాయింట్స్ ను కేవలం క్రెడిట్ కార్డు వినియోగదారులు మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంటుంది.. కానీ ప్రస్తుతం తీసుకు వచ్చిన సరికొత్త ఆవిష్కరణలతో క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు సాధించిన రివార్డు పాయింట్లను స్నేహితులకు బంధువులకు షేర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు షేర్ చేయాలనుకునేవారు కూడా ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు అయి ఉండాలి.




 అయితే బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి ఫీచర్ తీసుకు వచ్చిన మొదటి బ్యాంకు యస్  బ్యాంకు కావడం గమనార్హం. ప్రస్తుతం క్రెడిట్ కార్డు పరిశ్రమలో  ఎస్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ గా నిలుస్తుందని ప్రస్తుతం నిపుణులు భావిస్తున్నారు. అటు బ్యాంకు కూడా ఇదే అభిప్రాయంతో ఈ సరికొత్త ఆవిష్కరణ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో రివార్డు పాయింట్లతో బిల్లు కూడా కట్టేందుకు అవకాశం ఉంటుంది అనే విషయం తెలిసిందే. బెనిఫిట్ మాత్రం ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు దారులకు మాత్రమే వర్తిస్తుంది అని నిబంధన పెట్టింది ఎస్ బ్యాంక్. ఏదేమైనా ఇది క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: