యువత అతి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇంక చెప్పాలంటే మరో వైపు దుర్మార్గాలకు దారుణాలకు పాల్పడుతున్నారు.. అతి చిన్న వయసు లోనే నేరాలు చేసి జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు కూడా ఓ దారుణ సంఘటన జరిగింది. ఫ్రెండ్ తల్లి పై కన్నేసిన ఓ కామాంధుడు ఫ్రెండ్ ఇంట్లో లేని సమయం చూసి అతని తల్లి పై దారుణానికి ఒడిగట్టారు. ఆమె తప్పించుకొని గదిలో  బంధించింది..ఇరుగు పొరుగు వారి సాయం తో అతన్ని చావ బాదారు.. చివరికి పోలీసులకు అప్పగించారు.



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ సంఘటన ఘటన రాజస్థాన్‌ లోని అల్వార్‌లో చోటు చేసుకుంది. అల్వార్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల ఓ మహిళ ఏళ్ల కిందటే భర్తను కోల్పోయింది. ఒక్కగానొక్క కుమారుడి తో కలిసి నివసిస్తోంది. ఆ కుమారుడికి వికాస్ జాట్  అనే స్నేహితుడు ఉన్నాడు. అతడు తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో వారి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆమె కొడుకు ఇంట్లో లేడు.. అదే అదునుగా చూసుకున్న అతను ఆమె పై దారుణానికి ఒడిగట్టారు.



కొడుకు లాంటివాడని ఇంట్లోకి రానిస్తే.. ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత తన నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు. అతని బారి నుంచి తప్పించుకున్న ఆమె ఒక గదిలో బంధించి చుట్టుపక్కల వాళ్ళను పిలిచింది.. అతడికి దేహశుద్ది చేసిన వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు మద్యానికి బానిసయ్యాడని, తరచూ పోర్న్ వీడియోలు చూసే వాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో భర్త లేని ఆ మహిళ పై అఘాయిత్యానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి: