గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది అన్ని పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళీ సత్తా చాటాలని టీఆర్ఎస్ చూస్తూ ఉంటే దుబ్బాక ఎన్నికలతో జోరు మీద ఉన్న బిజెపి గ్రేటర్ లో కూడా తన సత్తా చాటి వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఊపు మీద ఉంది. కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇచ్చింది తామేనని ఏకైక నినాదంతో ముందుకు వెళుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది

అయితే ఎవరెన్ని చెప్పినా విజయం మాదే అంటున్నారు జూబ్లీహిల్స్ డివిజన్లోని వెంకటేశ్వర హిల్స్ కార్పొరేటర్ కవిత. ఆమె మరోసారి అదే స్థానం నుంచి కార్పొరేటర్ గా బరిలోకి దిగారు ఈ గ్రామంలో తక్కువ సమయంలో ప్రచారం ఎలా చేస్తున్నారంటూ ఒక ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాము నిరంతరం ప్రజల్లోనే ఉండే వాళ్ళం కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం తమకు ఏమి కొత్త కాదని ప్రచారం చేస్తున్నట్లు లేదని చెప్పుకొచ్చారు.

 తమ ప్రభుత్వం చేసిన పనులే తనను గెలిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. అలానే వరద సాయం కూడా తమకు ప్లస్ అవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తమ డివిజన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ డివిజన్ నుంచి బీజేపీ తరఫున ఉమా అనే ఆవిడ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి రమ్య బరిలో ఉన్నారు టిడిపి నుంచి కూడా స్వప్న బరిలో ఉన్నారు. కొన్ని సీట్లు అయినా సాధించి తెలుగుదేశం ఇంకా బతికే ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం లో టిడిపి ఉంది. అయితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే విషయం తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: