తెలంగాణలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మొత్తం వాడి వేడి గా మారిపోయాయి ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో హామీలను కురిపిస్తూ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం గ్రేటర్ లో ఎక్కడ చూసినా రోడ్ షోలు  ర్యాలీలు ఇంటింటి ప్రచారం లతో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వివిధ పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక పార్టీలోని ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.



 ఇటీవలే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అయోధ్య నగర్  లో  దివంగత నేత చంద్ర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీడిమెట్ల 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ఇటీవలే ప్రచారం నిర్వహించారు. అంతే  కాకుండా ఆమెతో కలిసి యువ నాయకులు భరత సింహారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ప్రజల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా 132 వ డివిజన్ లో గత పాలకులు  ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటూ ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి తార చంద్ర రెడ్డి విమర్శలు గుప్పించారు.




 ఇక మరో సారి టిఆర్ఎస్ కు ఓటు వేసి ప్రజలందరూ మోసపోవద్దని బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలందరినీ కోరారు 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు తారా  చంద్రా రెడ్డి. ప్రస్తుతం 132 వ డివిజన్ లో ఎక్కడ చూసినా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని.. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీ  అధికారంలోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చారు 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: