గ్రేటర్ ఎన్నికల వేళా హోటళ్ళకి గిరాకీ పెరిగిపోయింది .. ఎన్నికల ప్రచారం కోసం ప్రముఖ పార్టీ కి చెందిన నాయకులందరూ హైదరాబాద్ లో వాలిపోతున్నారు ..ఆ నాయకులందరూ  రోజు వాడవాడలా,వీధివీధినా తమ  అభ్యర్థులతో కలిసి  రోడ్ షోస్ ని ,మరియు ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తూ  బిజీ బిజీగా గడుపుతున్నారు .. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల వేళా నగరంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్స్ కళకళ లాడుతున్నాయి ..

కరోనా ప్రభావం తో కొన్నినెలలకు పైగా మూత పడ్డ హోటళ్లు  మరియు రెసారెంట్లు ఈ గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని మళ్ళీ రద్దీ గా మారడం మొదలైయ్యాయి .. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాజకీయ నాయకులతో నగరం లోని హోటళ్లు నిండిపోతున్నాయి .. ఈ సందర్బంగా హోటల్ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .. మరో పక్క హోటల్లో ఉండే వారు తినడానికి నగరంలోని రెస్టారెంట్ లను ఉపయోగించడం వాళ్ళ  హైదరాబాద్ లో రెస్టారెంట్ లకి గిరాకీ పెరిగిపోయింది ... ఒక్క ఎన్నికల కారణమే కాకుండా .. నగరం లో ఆన్లైన్ ఫుడ్ డెలివెరీలు కూడా పెరిగాయని ఒక సర్వే  చెబుతుంది ..

ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గడం తో హోటల్స్ మరియు రెస్టారెంట్స్ తెరుచుకున్నాయి .. మొదట్లో తక్కువ సంఖ్యలో హోటల్స్  తెరుచుకున్నప్పటికీ అవి ఎక్కువగా ఫుడ్ డెలివరీలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చేవి . క్రమంగా నవంబర్ నాటికీ నగరం లో పూర్తి స్థాయిలో హోటల్ తెరుచుకోవడం అప్పుడే గ్రేటర్ ఎన్నికలు రావడం పట్ల హోటల్ యజమానులకు బాగా కలిసివచ్చింది .. ఆగష్టు నెలలో వచ్చే ఆదాయం తో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగుపడిందని హోటల్ యజమానులు అంటున్నారు ..

గ్రేటర్ ఎన్నికల వేల రాజకీయ నాయకులకి హోటల్  వసతి కల్పిస్తున్నారు ..  వారితో పాటు నగర వాసులు కూడా  హోటళ్లను ఆశ్రయిస్తున్నారు .. అందులో భాగంగా నగర వాసుల నుండి ఫుడ్ డెలివరీలు ఎక్కువగా వస్తుండటం విశేషం .. ఆ ఫుడ్ డెలివరీలో కూడా చికెన్ ,మటన్ బిర్యానీలు ఎక్కువగా ఆర్డర్లు పెరిగాయని చెబుతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: