ప్రస్తుతం అందరూ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే.. ఇప్పటికీ కొంతమందిలో మాత్రం అవగాహన లేమి వెంటాడుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలలో సందేహాలు చాలా మందిని అయోమయంలో పడేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఆ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందా అనే అనుమానం ఈ మధ్యకాలంలో ఎంతోమంది లో తలెత్తుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత వైద్యులను సంప్రదించి ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. అయితే ఓకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చ అనే  విషయంలో మాత్రం అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు.



 ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి అయినా లేదా వేరే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఎలాంటి హాని జరగదు అని ప్రస్తుతం వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అయితే ప్రస్తుతం ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే హాని కలుగుతుంది అని ఎంతో మంది ప్రజల్లో ఉన్న అపోహ  నిజం కాదని.. ఓకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ భార్యకు ఓ పాజిటివ్ ఉండి భర్తకు కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇద్దరికీ కలిసి ఆర్హెచ్ ప్లస్ అర్థమట. ఇలాంటి ఈ సమస్యలకు కారణం అవ్వదు అని చెబుతున్నారు నిపుణులు.



 అయితే తల్లి తండ్రి ఓకే బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నప్పుడు వారి సంతానానికి కూడా అదే బ్లడ్ గ్రూప్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఓకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి హానీ కలగదు అని స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ తల్లి తండ్రికి వేరు వేరు బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లలకు ఇద్దరిలో ఎవరిదో ఒకరి బ్లడ్ గ్రూపు వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు.. తల్లి బ్లడ్ గ్రూప్ వారసత్వంగా వచ్చిన పిల్లల కంటే తండ్రి వారసత్వంగా వచ్చిన పిల్లలు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు కూడా చెప్పాయి  అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: