ఈ మధ్యకాలంలో నగర జీవన శైలికి ఎక్కువగా యువత అలవాటు పడుతుంది అన్న విషయం తెలిసిందే.   సాధారణంగా పల్లెల్లో పట్టణాల్లో జీవించే యువత సైతం నగరాల్లో కి వెళ్లి జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత అక్షరాస్యులుగా ఉంటూ ఉండటం అటు నగరాలలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉండడంతో ప్రస్తుతం ఎక్కువ మంది యువత నగరాలకు వెళ్లి అక్కడే ఉపాధి పొందుతూ నివసిస్తున్నారు. అదేసమయంలో నేటి తరం యువత ఆధునిక పోకడల వైపు అడుగులేస్తూ  ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో వ్యాధుల బారిన కూడా పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ముఖ్యంగా నగరాల్లో జీవించే యువత జీవన శైలి రోజురోజుకు మారిపోతుంది. దీంతో టెక్నాలజీకి అనుకూలంగా  మార్పులు రావడం మంచిదే కానీ ఏకంగా యువతలో వస్తున్న మార్పులు ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న యువత నేటి తరంలో ఆరోగ్యం విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. దీంతో తగిన జాగ్రత్తలు పాటించకుండా.. పౌష్టిక మైన ఆహారం తీసుకోకుండా ఉండడంతో ప్రస్తుతం ఎంతో మంది వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఒక్క నగరంలోనే కాదు దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.



 ఇటీవల ఓ సర్వేలో ఇలాంటి ఓ ఆసక్తికర నిజం బయటపడింది. మెట్రో నగరాల్లో ఉంటున్న యువతకు భవిష్యత్తులో షుగర్ వ్యాధి వస్తుంది అని ఇటీవల ఓ సర్వేలో తేలింది.  యువకుల్లో 56 శాతం యువతుల్లో 65 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది అని ఈ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం మెట్రోనగరాల్లో జీవిస్తున్న ఎంతోమంది స్థూలకాయుల్లో కూడా 86% ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఈ సర్వే తెలిపింది.  అయితే దేశంలో ఇప్పటివరకు ఏకంగా 13.40 కోట్లమంది ప్రజలు మధుమేహులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: