తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో గ్రేటర్ ఎన్నికల తాకిడి మాములుగా లేదని చెప్పాలి.. ఎవరికీ వారే గ్రేట్ అనే ఆలోచనలో రాజకీయ నేతలు మరియు కార్యకర్తలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధిని గురించి చెప్తూ ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు.. కొత్త నిధులను మంజూరు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని మరొకరు పోటీ లో వెనకడుగు వేయకుండా ప్రచారంలో జోరును పెంచుతున్నారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో నాయకులకు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది.



ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒకవైపు చెబుతుంటే మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామంటూ అబద్దాలతో ఊదర గొడుతున్నాడని రాష్ర్ట మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీహెచ్ఎంసీ పఠాన్‌చెరు డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టుకుమార్, భారతీనగర్ డివిజన్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా మంత్రి హరీశ్‌రావు నేడు ప్రచారం నిర్వహించారు.



ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..వరదలు వచ్చిన, ఎటువంటి తుఫానులు వచ్చిన తెరాస ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయలేదు.. అయితే ఎప్పటికప్పుడు ప్రజలను ఆదుకోవడంలో ముందు ఉంటుంది. అలాంటి ఈ పార్టీకి ప్రజల మద్దతు చాలా అవసరం.. బీజీపీ కుట్రలను నమ్మకండి. నల్లధనం బీజేపీ నాయకుల జేబుల్లోకి వెళ్లింది. బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తప్ప యువత కోసం చేసిందేమి లేదన్నారు. యువత బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. పఠాన్‌చెరు నియోజకవర్గంలో మెడికల్ డివైస్ పార్కు, ఐటీ పార్కుల ఏర్పాటుతో ఉపాధి రాబోతుందని తెలిపారు. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందన్నారు. భారతీనగర్ డివిజన్ నుండి సింధు ఆదర్శ్ రెడ్డి, పఠాన్‌చెరు నుండి మెట్టు కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. పఠాన్‌చెరులోని యువత కోసం జాబ్ మేళా పెట్టి 4 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు హరీష్ రావు గుర్తుచేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: