జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరందుకోగా, అభ్యర్థులు వారి వారి అజెండాను ప్రజలకు వివరిస్తూ ఓట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ సారి ఎన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నా కూడా ప్రధానంగా పోటీ మాత్రం అధికార పార్టీ తెరాసకి మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మధ్యే ఉంటుందని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. దానికి ప్రధాన కారణం ఇటీవల ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే...దెబ్బతిన్న పులిలా తెరాస అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది..

ఇదంతా అలా ఉంటే ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పదునైన మాటలతో అధికార పార్టీని ఇరుకున పడేస్తున్నారు. వారు చేస్తున్న మోసాలను, అన్యాయాలను ప్రజలు ముందే ఎండ గడుతున్నారు.  దీనితో తెరాస వైపు నుండి ధీటుగా సమాధానమిచ్చే వారే కరువయ్యారు. ఇప్పుడు కేసీఆర్ ఎటూ తేల్చుకోలేక సతమవుతున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి ప్రతిగా కేసీఆర్ దాదాపు 90 మంది ఎమ్మెల్యే లకు ప్రచార కార్యక్రమాల బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

అయితే తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగాడు. దీనితో ఇప్పటికే బండి సంజయ్ ని తట్టుకోలేక విలవిలలాడుతుంటే, మరో వైపు ధర్మపురి అరవింద్ కూడా తన నోటికి పనిచెప్పాడు.  దీనితో అగ్నికి వాయువు తోడైనట్టుగా, వీరిద్దరూ తెరాస ని చెడుగుడు ఆడుకుంటున్నారు. అరవింద్ కేటీఆర్ పై కూడా తన దైన శైలిలో రెచ్చిపోయారు, ఒక మంత్రిగా ఉండి పిల్లర్లు, బస్టాండులు మరియు టాయిలెట్లపై మీ బొమ్మలు అతికించడానికి అవేమీ మీ బాబు సొత్తుకాదు అంటూ పరుష వ్యాఖ్యలు చేసాడు. అవకాశం దొరికినప్పుడల్లా తెరాస ను ఇబ్బంది పెట్టేందుకు బండి సంజయ్ మరియు ధర్మపురి అరవింద్ ఇద్దరూ బీజేపీ ఫైర్ బ్రాండ్ల లాగా వ్యవహరిస్తున్నారు. మరి మున్ముందు ఏమి జరగనుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: