జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడితో హైదరాబాద్ నగరం హీటెక్కుతోంది. అన్ని పార్టీలూ గెలుపు కోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం విషయంలో బీజేపీ మంచి జోరు చూపిస్తోంది. దుబ్బాకలో అధికార పార్టీని ఓడించిన బీజేపీ.. అదే జోరులో గ్రేటర్ ఎన్నికల్లో తలపడాలని భావిస్తోంది. ఇక్కడ కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. దీనికోసం పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారట. ఆమెతో పాటు బీజేపీలో ఉన్న సెలెబ్రిటీలు గౌతమ్ గంభీర్, నటి ఖుష్బూ కూడా భాగ్యనగరానికి వచ్చేశారు. ఇదే క్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ కూడా ఇక్కడకు వచ్చారు. వీరితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇక్కడ ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11గంటలకు బీజేపీ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను రేపు విడుదల చేయనున్నారు. దీన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ విడుదల చేస్తారట. శుక్రవారం గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గౌతమ్ గంభీర్, కుష్బూ అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యానాథ్‌లను ప్రచారానికి తెలంగాణ బీజేపీ నాయకులు ఆహ్వానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: