గ్రేటర్ హైదరాబాద్ లో ఒకపుడు పసుపు జెండా రెపరెపలాడేది. ఎంతటి స్ట్రాంగ్ పొజిషన్ లో  టీడీపీ ఉండేది అంటే వైఎస్సార్ ప్రజాకర్షణను సైతం కాదని ధీటుగా అప్పట్లో నిలబడింది. అప్పట్లో కాంగ్రెస్  గ్రేటర్ పీఠం పై జెండా ఎగరేసినా కూడా యాభై కి తగ్గకుండా డివిజన్లను ఆనాడు గెలుచుకుని సైకిలు స్పీడ్ ఏంటో టీడీపీ రుచి  చూపించింది. అటువంటి టీడీపీకి ఇప్పటికి స్ట్రాంగ్ బేస్ ఉంది. ఆంధ్రా మూలాలు ఉన్న వారు, సెటిలర్లు ఉన్న చోట టీడీపీకి మంచి పలుకుబడి ఉంది.

దాదాపుగా ముప్పయి లక్షల దాకా ఓట్లు సెటిలర్స్ వి ఉంటే టీడీపీ సామాజికవర్గం వారు కూడా పెద్ద సంఖ్యలోనే చాలా చోట్ల ఉన్నారు. ఆయా చోట్ల వారు కచ్చితంగా టీడీపీ పోటీలో ఉంటే తన తొలి ఆప్షన్ గా ఆ పార్టీనే ఎంచుకుంటారు. అయితే టీడీపీ ఇపుడు యాభై డివిజన్లనే టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతోంది. దీంతో అక్కడ టీడీపీకి పడే ఓట్లు ఎవరివి అవుతాయి అన్నది చర్చగా ఉంది.

నిజానికి టీడీపీ చివరి నిముషంలో పోటీకి రెడీ అయింది. పార్టీ క్యాడర్ వత్తిడి మూలంగా తెలంగాణా శాఖకే చంద్రబాబు చాయిస్ వదిలేశారు. అంతా తెలంగాణా టీడీపీ లీడర్స్ చూసుకుంటున్నారు. ఇక టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూండడంతో బీజేపీకి పడే ఓట్లు టీడీపీకి వెళ్తాయని అంటున్నారు. ప్రభుత్వం మీద యాంటీ ఇంకబెన్సీ ఉంటే దాన్ని టీడీపీ నిలువునా చీల్చేస్తుందని అంటున్నారు. ఆ పరిణామం వల్ల కచ్చితంగా బీజేపీ నష్టపోతే టీయారెస్ అంతకు అంతా లాభపడుతుందని విశ్లెషణలు ఉన్నాయి. ఇక టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉన్నా ప్రచారం లేకపోవడం సరైన లీడర్ దన్నుగా లేకపోవడంతో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది చెప్పలేకపోతున్నారు మొత్తానికి గెలిచే పార్టీగా కంటే చీల్చే పార్టీగానే టీడీపీని తెలంగాణాలో చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: