గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ లో కీలక నేతలు ఎవరు చేస్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద దృష్టి పెట్టలేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. దీనివలన పార్టీ నష్టపోతుందని అనే భావన కొంతమందిలో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసుకునే విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి ఇప్పుడు ప్రచారం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు దిగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో కొంత మంది నేతలను దింపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొంతమంది హైదరాబాద్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాదులో ప్రియాంకా గాంధీని ప్రచారానికి పంపించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

ప్రియాంక గాంధీ తో ఇప్పటికే సోనియా గాంధీ చర్చలు జరిపారని ఆమె హైదరాబాదు ప్రచారానికి వెళ్లడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. దీనితో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆమె ఎప్పుడూ ప్రచారం మొదలు పెడతారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా రెండు మూడు రోజుల్లో ప్రచారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న ప్రాంతాలతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రచారం చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ను కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు రెడీ చేసి పెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: