గ్రేటర్ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో రానున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దుబ్బాక ఎన్నికల ఘటన రిపీట్ కాకుండా అనేక చర్యలను తీసుకుంటున్నారు. నగరం లోని నియోజక వర్గాల్లోని నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇకపోతే ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపి అధికార జెండాను నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు. వాడి వేడిగా ఇరు పార్టీల నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు.



దుబ్బాక ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిచిన బిజేపికి ఈ ఎన్నికలు కత్తిమీద సాము లా మారాయి.. రెండో సారి ఎన్నికల్లో గెలిస్తే ప్రజల్లో నమ్మకం ఉంటుందని కమల దళం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో మరింత మెరుగు ఉండాలని బిజెపి నేతలు , కార్యకర్తలు ఢిల్లీ నుంచి. పెద్దలను కూడా బాగా స్వాములు చేస్తున్నారు.ఇకపోతే ఈ ఎన్నికల వేళ అందరూ చేసే విధంగా పోటీలో ఉన్న మరొక పార్టీ పై దుమ్మెత్తి పోస్తున్నారు.



ఇకపోతే హైదరాబాద్ లో కొన్ని ప్రముఖ ఛానెల్స్ ఎన్నికల సర్వే నిర్వహించారు.ఈ మేరకు రామచంద్ర పురంలో సర్వే నిర్వహించారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పై నిరాశకు లోనయ్యారు..ప్రభుత్వం తీరు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరదలకు ప్రభుత్వం అన్నీ ఉన్న వాళ్ళు ఆదుకొంది.లేని వాళ్ళను మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ప్లాట్స్ ఇస్తామని చెప్పారు. కానీ వచ్చి 50 ఏళ్లు పైన అయిన కూడా నీడ కూడా లేకుండా చేశారు. ఈ సర్కారు ఓట్లకు మాత్రమే దగ్గరకు వస్తారు. గెలిచాక ప్రజలు ఎలా పట్టించుకోరు. అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ప్రజల స్పందన చూస్తుంటే ఆ ప్రాంతాల్లో టీఆరెఎస్ పార్టీ ఓటు బ్యాంక్ కు గండి పడినట్లే అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: