హైదరాబాద్ లో ఒకవైపు గ్రేటర్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు మాత్రం స్థానికులు మాత్రం బిజినెస్ లను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ప్రచారం జరుగుతున్న ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకొనేవారు. భారీగా రేట్లను పెంచేశారు.ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ కి భారీ డిమాండ్ పెరిగింది. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోని హోటళ్లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బిర్యానీకి వస్తోన్న గిరాకీతో హోటళ్ల బిజినెస్ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలకు, మద్దతుదారులకు నాయకులు బిర్యానీ కొనిస్తుంటారు.



ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే డబ్బుల తో పాటుగా బిర్యానీ కూడా వస్తుందని ర్యాలీలో పాల్గొంటారు.. అయితే హోటళ్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. బల్క్‌గా ఇస్తున్న ఫుడ్‌ ఆర్డర్లతో పాటు హోమ్‌ డెలివరీలు సైతం భారీగా ఊపందుకున్నాయి. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడంతో హోటళ్లకు వెళ్తున్న వారి సంఖ్య కూడా మొత్తానికి పెరిగింది .గత ఎనిమిది నెలలుగా హోటళ్లకు సరైన లాభాలు లేక వెల వెల బోయాయి. ఎన్నికల పుణ్యమా అంటూ ఫుల్ బిజీగా కళకళలాడుతున్నాయి.



రాజేంద్ర నగర్ లోని పలు హోటల్ యాజమాన్యాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయి.. ముఖ్యంగా తెరాస నేతలు ప్రచారం లో భాగంగా ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నారని సదరు హోటల్ యాజమాన్యాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో పరిస్థితి బాగా మెరుగైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌ కు ఇతర జిల్లాల నుంచి కూడా పలు పార్టీల నాయకులు వచ్చారు. దాదాపు 5 వేల మంది నాయకులు, వారి అనుచరులు హోటళ్లలోనే ఉంటున్నారు. హోటళ్లలో సీటింగ్‌ సామర్థ్యం కూడా 75 శాతానికి పెరిగిందని హోటల్ మేనేజ్మెంట్ చెబుతున్నారు. దీనిపై ప్రజలు కూడా మిశ్రమ స్పందనను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: