గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం కాస్త బిజెపి దూకుడుగా చేస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరాని కాస్త ఆవేశంగా విమర్శలు చేసారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పై కేంద్రమంత్రి స్మ్రతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేసారు. వరద నష్టంపై ఇప్పటి వరకు సమగ్ర నివేదికలు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని కేంద్రమంత్రి విమర్శలు చేసారు. అక్రమ వలసదారులకు హైద్రాబాద్ లో ఓటు హక్కు కల్పించారని ఆరోహణలు చేసారు.

బంగ్లాదేశ్, రోహింగ్యాల ముస్లింలను రాజకీయ లబ్ధి కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ కాపాడుతున్నాయి అని ఆమె మండిపడ్డారు. 75 వేల రోహింగ్యా కుటుంబాలకు హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి అని ఆమె మండిపడ్డారు. ఒక్క కుటుంబం మాత్రమే కాదు.‌. ఎందరో త్యాగాల ఫలితమే  తెలంగాణ అని ఆమె స్పష్టం చేసారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుంది అని ఆమె అన్నారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని ఆమె స్పష్టం చేసారు.

తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటోంది అని ఆమె అన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసి ఉంటే.. కరోనా సోకిన పేదలకు లబ్ధి చేకూరేది అని ఆమె వ్యాఖ్యానించారు. పారదర్శకమైన  పాలన అందించటమే బీజేపీ లక్ష్యం  అని స్పష్టం చేసారు. లెటర్ హెడ్స్ తో ఎంఐఎం నాయకులు రోహింగ్యా ముస్లింలను కాపాడుతున్నారు అని మండిపడ్డారు. అక్రమ వలసదారుల ఓటు హక్కును తొలగించాలి అన్నారు. తెలంగాణకు టెక్స్ టైక్స్ పార్క్ ను కేంద్రం మంజూరు చేసింది అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథాకాలు  తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదు అని మండిపడ్డారు. హామీల అమల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: