తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుంది.అన్నీ రాజకీయ పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. అధికార,ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఒకరి మీద మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ కి చెందిన నేత, ఎంపీ అరవింద్ పై కేసు నమోదు అయ్యింది. 

 హైదరబాద్ లోని కేబీఆర్ పార్క్ సమీపంలో తెరాస నేతలకు సంబంధించిన ఫ్లెక్సీ లను చించివేసిన ఘటనకు సంబంధించి ఎంపీ అరవింద్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే టి‌ఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్ పైన మరియు కార్యకర్తల పై కేసు నమోదు అయ్యింది. అయితే నిన్న ప్రచారం లో బాగంగా ఎంపీ అరవింద్ అధికార పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు . 

టి‌ఆర్‌ఎస్ గ్రేటర్ ఎనికలతో మూతపడిపోవడం ఖాయం అని అన్నారు. ప్రజలు టి‌ఆర్‌ఎస్ పైన నమ్మకం పోయి కొత్త పాలనను కోరుకుంటున్నారు. కరీం నగర్, నిజామాబాద్, దుబ్బాక ఎన్నికల్లో  నిజాయితీ గా ఓటు వేశారో,అలానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయాలి అని ప్రజలకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. అంతేకాక బీజేపీ కి ఓటు వేసి మార్పుకి నాంది పలకాలి అంటూ ప్రజలను కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: